Etela Rajender Fires On CM KCR: కేసీఆర్ నీ భరతం పడతాం అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని శామీర్‌పేట రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు.  కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు  ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని.. పేదవారికి ఇబ్బంది లేకుండా భూప్రక్షాళన చేస్తామని కేసీఆర్ చెప్పారు. విమర్శలు రావడంతో ధరణి తీసుకువచ్చారు. ధరణి పేరుతో దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శం చేస్తామన్నారు. ఇది రైతులకు మేలు చేస్తుందా.. కొంపలు ముంచడానికా అని చాలా మంది ఆ రోజే అన్నారు. రైతుల కొంపలు ముంచడానికే ధరణి అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ బొమ్మరాజుపేట కేసు. 


సర్వే నంబర్  323 నుంచి 409 వరకు 1050 ఎకరాల భూములలో 50 ఏళ్లుగా రైతులు ఉంటున్నారు. నేను 1999 నుంచి 41 సంవత్సరాలుగా ఉంటున్నా.. ఇక్కడ ఉన్న వారందరూ నాకు తెలుసు. గ్రేప్ గార్డెన్ పెట్టుకున్నారు. పౌల్ట్రీ ఫాం పెట్టుకున్నారు. ధరణి పేరు చెప్పి ఇప్పుడు కేసీఆర్, ఆయన బందువులు, తాబేదారులు 50 ఏళ్ల కింద కొనుక్కున్న  రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ ఏళ్ల కాలం నీ రాజ్యం నడవదు. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతా. 


ఎమ్మార్వోలు, ఆర్డీవోలు  కుర్చీల్లో కూర్చుంది పేద రైతుల కోసమా..? బ్రోకర్ల కోసమా..? రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా..? రైతులే భూకబ్జా కారులు అని రాస్తున్నారు. ఆ పత్రిక ఎవరికి ఊడిగం చేస్తుందో అందరికీ తెలుసు. కేసీఆర్ పేదల కళ్లలో మట్టి కొడుతున్నారు. కలెక్టర్ స్పందించక పోతే మీ సంగతి చూస్తాం. అధికారులు పిచ్చి వేషాలు బంద్ చేయాలి. సెటిల్ చేసుకోండి అని చెప్తున్నారట మీ భరతం.. బ్రోకర్ల భరతం పడతాం. రైతులకు అండగా ఉంటాం. ధరణీలో లక్షల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నా.." అని ఈటల రాజేందర్ అన్నారు.


Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం  


Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి