Munawar Faruqui: కాంట్రవర్సీ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ పర్యటన సెగలు రేపుతోంది. మునావర్ ఫరూఖీ హైదరాబాద్ కార్యక్రమాన్నిఅడ్డుకొంటామని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మునావర్ ఫరూఖీ ఈవెంట్  నిర్వహించే హాల్ ను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను దగ్దం చేస్తామన్నారు రాజాసింగ్.  మునావర్  హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మునావర్ ఫారూఖీకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. ఫారూఖీ హైదరాబాద్ లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామన్నారు రాజాసింగ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తుంటారు మునావర్ ఫరూఖీ.  కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంఘాలు ఆయనపై తీవ్రంగా ఫైరవుతున్నాయి. సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది. కర్ణాటకలో మునావర్ షోలను నిషేదించారు.  తాజాగా మునావర్ ఈ నెల 20న హైదరాబాద్ లో షో ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ కోసం బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. మునావర్ షోలో పాల్గొనేందుకు టికెట్ ధరను 499 రూపాయలుగా నిర్ణయించారు. మునావర్ షో  నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజాసింగ్  హెచ్చరించడంతో ఆందోళన నెలకొంది. రాజాసింగ్ వార్నింగ్ ఇవ్వడంతో  నిర్వాహకులు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.


ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు.  మునావర్ ఫరాఖీకి  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు.ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలోనూ మునావర్ ఫారుఖీ షో విషయంలో అనేకసార్లు హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఆయన కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 


Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం


Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్....   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook