హైదరాబాద్ పేరు మార్పిడి ( Hyderabad name change )పై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే..హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ పేరు మార్పిడిపై బీజేపీ ( BJP ) మరోసారి దృష్టి సారించింది.  బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ( Nizamabad Mp Dharmapuri Aravind ) చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే..రాజధాని హైదరాబాద్ పేరును మారుస్తామంటూ సంచలన ప్రకటన చేశారు అరవింద్. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్నారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. 


మరోవైపు మంత్రి కేటీఆర్ ( KTR ) పై విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రి కేటీఆర్ కు కేంద్రం ఇచ్చిన నిధుల కంటే బాలీవుడ్ విషయాలపైనే ఎక్కువ తెలుసని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు బాలీవుడ్‌తో గొడవ జరిగినట్లు సోషల్‌మీడియాలో చదివానని ఎంపీ అరవింద్ చెప్పారు. సీఎం కుమారుడు కాకపోయుంటే.. కేటీఆర్‌ను పట్టించుకునేదెవరని అరవింద్ ప్రశ్నించారు. కేటీఆర్‌ మాటల్లో గ్రేటర్‌ ఎన్నికల ఓటమి భయం కనిపిస్తోందని విమర్శించారు. విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఇచ్చిన 224 కోట్లు కేటీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరద బాధితుల సాయం కేటీఆర్ కుటుంబం ఇస్తోందా అని నిలదీశారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. పనిలో మాత్రం సోమరిపోతని అరవింద్ విమర్శించారు. Also read: Telangana: రాష్ట్రంలో తెర్చుకోనున్న కోర్టులు