Telangana: రాష్ట్రంలో తెర్చుకోనున్న కోర్టులు

తెలంగాణలో ఇకపై కోర్టులు తెర్చుకోనున్నాయి. రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్‌లాక్ విధి విదానాల్ని కోర్టు వెల్లడించింది.

Last Updated : Nov 8, 2020, 05:39 PM IST
Telangana: రాష్ట్రంలో తెర్చుకోనున్న కోర్టులు

తెలంగాణ ( Telangana ) లో ఇకపై కోర్టులు తెర్చుకోనున్నాయి. రాష్ట్ర హైకోర్టు ( High court ) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్ లాక్ విధి విదానాల్ని కోర్టు వెల్లడించింది.

కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో దిగువ కోర్టులు మూతపడ్డాయి. హైకోర్టు మినహా మిగిలిన కోర్టులు పనిచేయడం లేదు. అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ  చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు తగ్గడం, దేశంలో అన్‌లాక్ ప్రక్రియ నడుస్తుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లు తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే డిసెంబర్ 31 వరకూ పాటించాల్సిన అన్‌లాక్ విధి విధానాల్ని జారీ చేసింది. మరోవైపు ప్రజా ప్రతినిధులపై విచారణను వేగవంతం చేయాలని..హైకోర్టు ఉత్తర్వులకు కట్టుబడి విచారణ ముగించాలని ఆదేశించింది. హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్‌, క్రిమినల్‌ కోర్టులు కూడా తెరవాలని ఆదేశించింది.  డిసెంబర్‌ 31 వరకు ప్రస్తుత ఆన్‌లైన్‌, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని సూచించింది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగించాలని ఆదేశించింది. Also read: Hyderabad Flood Relief Fund: ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశాం: కేటీఆర్

 

Trending News