Arvind On CM KCR: `పాస్‌పోర్టులు అమ్ముకున్న దొంగ` అంటూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు..!
Arvind On CM KCR: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాస్ట్‌పోర్టులు అమ్ముకున్న దొంగ అంటూ ఆరోపణలు చేశారు.
Arvind On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. నిన్న తన కారుపై జరిగిన దాడి గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంపీ అర్వింద్. ఇందులో సీఎం కేసీఆర్ సహా.. ఆయన కుటుంబంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న వారిపైనా ధ్వజమెత్తారు.
ఇలాంటి సీఎం, వారి కుటుంబ సభ్యులపై ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆధారపడితే వ్యవస్థ ఇలానే ఉంటుందని తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ విమర్శలు చేశారు.
కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు..
'పాస్‌పోర్ట్‌లు అమ్ముకున్న దొంగ, లారీలు ఆపి పైసలు వసూలు చేసిన.. వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక టైంలో మంచి పేరు తెచ్చుకున్న మహేందర్ రెడ్డి లాంటి వారు కూడా ఇలానే తయారవుతారు' అని అర్వింద్ ఆరోపణలు చేశారు.
దాడి గురించి వివరాలు..
అయితే తాను నిన్న ఉదయం నందిపేట్ పేట్ ప్రొగ్రామ్‌కు హాజరవ్వాల్సి ఉందని చెప్పారు అర్వింద్. అర్మూరు నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుకులు ఆలూరు సమీపంలో పెద్ద ఎత్తున గుమి గూడారని.. వారికి తోడు 25 మంది వరకు హైదరాబాద్ నుంచి వచ్చారని ఆరోపించారు. దాడి ప్రణాళిక వారిదేనన్నారు.
వారి కార్ల నుంచే రాడ్లు, గడ్డపారలు, కత్తి తీసి.. తమ కార్లపై దాడి చేశారన్నారు. కొంత మంది తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తమ కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పారని వివరించారు.
ఈ విషయంపై కమిషనర్‌తో మాట్లాడితే.. వాళ్లను క్లియర్ చేసి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందుకే ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేసినట్లు వెల్లడించారు.
అయితే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారే తప్ప.. తనకు సెక్యూరిటీ పెంచపడం గానీ.. తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్న వారిని క్లియర్ చేయలేకపోయారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఈ విషయం చెప్పినట్లు తెలిపారు.
ఇక కార్యకర్తలు వెళ్దామని చెప్పడం, తనతో ఉన్న ఓ సీఐ కూడా క్లియర్ చేస్తున్నామనడంతో అక్కడి నుంచి బయల్దేరామన్నారు. అయితే ఇస్సాపల్లి గ్రామం చేరుకునే సమయానికి గొడవలు మరింత పెద్దగయ్యే అవకాశముందని ఫోన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దీనితో తాము అక్కడే ఆగిపోయామని.. టీఆర్‌ఎస్ కార్యకర్తలే అక్కడకు చేరి దాడి చేసినట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా తన కారు వద్ద లేరని ఆరోపించారు.
Also read: TRS District Presidents: టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే..
Also read: Republic Day 2022: ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook