Bandi Sanjay Paid Tributes to Dr BR Ambedkar: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్  జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరుకాకుండా అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలొస్తున్నాయని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు కోట్ల రూపాయలు వెచ్చించి యాడ్స్ ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఇన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడినే తొలి సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. దళితులకు మూడెకరాలు ఎందుకివ్వలేదని అడిగారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్‌కు బండి సంజయ్ నివాళి అర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంబేద్కర్ జయంతిని పురస్కరించుని ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహిస్తూ.. అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు బండి సంజయ్. అణగారిన వర్గాల దిక్సూచి అంబేద్కర్ అని ఐక్యరాజ్యసమితి పొగిడిందంటే అంబేద్కర్ గొప్పతనం అర్ధం చేసుకోవాలని అన్నారు.  


'కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఏనాడూ అంబేద్కర్‌ను గుర్తించిన దాఖలాల్లేవ్. ఆయన జయంతి, వర్దంతి కార్యక్రమాలకు ఏనాడూ హాజరుకాని వ్యక్తి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని బీజేపీ అనేకసార్లు గళమెత్తింది. సచివాలయాన్ని అనేక సార్లు సందర్శించి పనులను పరిశీలించిన కేసీఆర్ ఏనాడూ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించని విషయాన్ని ప్రజలు గుర్తించాలి. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే అర్హత కేసీఆర్‌కు లేదు. అంబేద్కర్‌ను, దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్. ఇన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి, వర్దంతులకు ఎందుకు హాజరు కాలేదో.. ఈరోజు ఆ వేదిక సాక్షిగా కేసీఆర్ జవాబివ్వాలి. దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. 


ఈరోజు కూడా ఎన్నికలు రాబోతున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఓట్లు దండుకోవాలనుకుంటున్నడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో ఎక్కువ లబ్ది పొందుతున్న వాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఆ నిధులు చెల్లించకపోవడంవల్ల వాళ్లకు కార్పొరేట్ విద్య, వైద్యం అందడం లేదు. ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం కేసీఆర్‌ను క్షమించదు. కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాం..' అని బండి సంజయ్ అన్నారు. 


Also Read:  Target Dream11 Prediction: కోల్‌కతా జోరుకు హైదరాబాద్ బ్రేక్ వేసేనా..? కేకేఆర్ Vs ఎస్‌ఆర్‌హెచ్ డ్రీమ్ 11 టిప్స్


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.