Bandi Sanjay On Dharmapuri Issue: బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో పట్టపగలే అందరూ చూస్తుండగా.. గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా.. ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయం అని అన్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయమని ఫైర్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. తాను నిఖార్సైన హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో రేపు తానే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.


కాగా.. ధర్మపురిలో జరిగిన ఘటనపై పోలీసులు స్పందించారు. నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌ వెల్లడించారు. ధర్మపురి పట్టణ సమీపంలోని ఇటుక బట్టీల వద్ద 4 ఎద్దులను వధిస్తున్నట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌కు సమాచారం వచ్చిందన్నారు. ఆయన వెంటనే అక్కడికి వెళ్లగా.. నాలుగు ఎడ్లను వధించినట్లు గుర్తించారని తెలిపారు. 


ఇటుక బట్టీల యజమానులు సయ్యద్‌ యూసుఫ్‌, మహ్మద్‌ ఇస్మాయిల్, ఎడ్లను వధించిన ఎండీ మజార్‌, శేఖర్‌ అనే వ్యక్తులను అరెస్ట్ చేశాన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో ఆవులను వధించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. 


Also Read: Rajanna Sircilla Family Death: సిరిసిల్ల జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య  


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి