Telangana: తెలంగాణ బీజేపీకు అనుకూలమైన రాష్ట్రంగా మారుతుందా..పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా ఛానెల్స్‌పై దృష్టి సారిస్తోంది. ఇప్పుడున్న ఛానెల్స్‌కు అదనంగా మరి కొన్ని వస్తున్నాయా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అధికార పార్టీకు ఎదురొడ్డి రాజకీయంగా ఎదగడం అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా మీడియా మద్దతు లేకుండా. టీఆర్ఎస్ ప్రభుత్వ ( TRS Government ) వైఫలాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలంటే  ప్రతిపక్షానికి ఓ ఛానెల్ అవసరం. అందుకే బీజేపీ ( BJP ) గత కొద్దికాలం నుంచే ఛానెల్స్‌పై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఛానెల్ తెలంగాణ వాదంతో  బీజేపీ అనుకూల ధోరణితో సాగుతోంది. అదనంగా ఇటీవల రాజ్ న్యూస్ వచ్చి చేరింది. ఇప్పటికే పలు యాజమాన్యాల్ని మార్చుకున్న రాజ్ న్యూస్ ఛానెల్ తాజాగా బీజేపీ అనుకూలుర చేతిలో పడిందని తెలుస్తోంది. బీజేపీ నేత నరోత్తం రెడ్డి ఈ ఛానెల్ బాధ్యతల్ని తీసుకున్నారు. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికల్లోనూ ( Dubbaka Elections ), జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ( Ghmc Elections ) రాజ్ న్యూస్ ఛానెల్..అధికారపార్టీ వైఫల్యాల్ని ప్రధానంగా ఎత్తి చూపించింది. అదే బీజేపీకు లాభించే అంశంగా మారిందని తెలంగాణ బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. Also read: Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగులకు నో ఛాన్స్..గ్రేటర్ ప్రభావం


2018 ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నరోత్తం రెడ్డి..వృత్తి రీత్యా ఇంజనీర్. రవిప్రకాష్‌ను రాజ్ న్యూస్ ఛానెల్‌కు రప్పించి..టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడంలో కీలకపాత్ర పోషించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 సెప్టెంబర్ నుంచి రాజ్ న్యూస్ ఛానెల్ నరోత్తం రెడ్డి చేతుల్లోకొచ్చింది.


ఇక మరో ఒకట్రెండు ఛానెల్స్‌పై తెలంగాణ బీజేపీ ( Telangana Bjp ) వర్గాలు దృష్టి పెట్టాయని తెలుస్తోంది. ఇంకో ఛానెల్ ఇప్పటికే కాస్త అనుకూలంగానే ఉంది. మరో ఛానెల్ కోసం బీజేపీ నేత నరోత్తమ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించే క్రమంలో ఛానెల్స్ అవసరం ఎంతైనా ఉందనేది పార్టీ వర్గాల భావన.


ఎందుకంటే 2019 లోక్‌సభ ( 2019 Loksabha Elections ) ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాల్ని గెల్చుకున్నప్పటి నుంచి బీజేపీ తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారించింది. తరువాత దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలాన్ని 4 నుంచి 48కు పెంచుకోగలిగింది. అధికారపార్టీ టీఆర్ఎస్‌కు చావుదెబ్బ కొట్టగలిగింది. ఈ పరిస్థితుల్లో న్యూస్ ఛానెల్స్ ఉంటే..ఇక తిరుగుండదనేది బీజేపీ ఆలోచనగా ఉంది.


Also read: GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కొంపముంచింది అదేనా..