Black Fungus: బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్పై Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
Black Fungus Infection In Telangana | ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ దీనిపై చర్యలు తీసుకుంటుంది. మ్యూకర్ మైకోసిస్ ద్వారా కలిగే బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైబుల్ వ్యాధి అని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త సమస్య బ్లాక్ ఫంగస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ (Black Fungus Infection)ని నోటిఫైబుల్ డిసీజ్ అని తెలంగాణ సర్కారు గురువారం ఉదయం ప్రకటించింది. COVID-19 బారి నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ (Mucormycosis) కేసులు నమోదైతే తమకు తప్పకుండా సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం మ్యూకర్ మైకోసిస్ ద్వారా కలిగే బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైబుల్ వ్యాధి అని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ (Black Fungus Infection) కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ దీనిపై చర్యలు తీసుకుంటుంది.
Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, 4 వేల దిగువకు మరణాలు
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్19(COVID-19) బారి నుంచి కోలుకున్న పలువురిలో బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైయబుల్ డిసీజ్ అని ప్రకటించగా, తాజాగా తెలంగాణ సర్కార్ సైతం అదే బాటలో నడుస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, బిహార్‌లలో బ్లాక్ ఫంగస్ బాధితుల్ని అధికంగా గుర్తించారు.
Also Read: EPFO: జీతం నుంచి నెలవారీ EPF ఎంత కట్ అవుతుంది, వడ్డీ వివరాలు చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook