భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా నాలుగోరోజు 3 లక్షలకు దిగువన నమోదయ్యాయి. నిన్నటి కేసులతో పోల్చితే మరోసారి పాజిటివ్ కేసులు పెరిగాయి. దాదాపు వారం రోజుల తరువాత తొలిసారి 4 వేలకు దిగువన కోవిడ్19 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం స్వాగతం పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 2,76,070 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,57,72,400 (2 కోట్ల 57 లక్షల 72 వేల 4 వందలు)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 3,874 మంది కోవిడ్19 బారిన పడి చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాలు 2,87,122కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Gold Price Today In India: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు
దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,69,077 మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,23,55,440 (2 కోట్ల 23 లక్షల 55 వేల 440)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 31,29,878 (31 లక్షల 29 వేల 878 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు దాదాపు లక్ష ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల 70 లక్షల 9 వేల 792 మందికి టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: EPFO: జీతం నుంచి నెలవారీ EPF ఎంత కట్ అవుతుంది, వడ్డీ వివరాలు చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook