Bonalu Tradition palaharam bandlu significance: ఆషాడం వచ్చిందంటే తెలంగాణలో బోనాల హల్ చల్ ఉంటుంది. ముఖ్యంగా ఆషాడంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే అమ్మవారికి వారి వారి సంప్రదాయం ప్రకారం బోనం సమర్పిస్తారు.  బోనం అంటే.. అమ్మవారికి భోజనం అని అర్థం. ముఖ్యంగా మహిళలు బోనాలను ఎంతో భక్తితో జరుపుకుంటారు. కుండలపై అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దుతారు. అందంగా ముస్తాబై, చేతి నిండా గాజులు, కాళ్లకు పారాణి, ముఖంకు పసుపు పెట్టుకుని ఆ చల్లని తల్లి కుండలను నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయంకు వస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..


అదే విధంగా.. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు కూడా బోనాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. గల్లీ గల్లీలలో అమ్మవారి పాటల డీజేల హోరుతో ఫుల్ జోష్ గా ఉంటుంది.  ఆషాఢమాసంలో హైదరాబాద్ నగరం అంతా పండగ వాతావరణంలా ఉంటుంది. హైదరాబాద్ లో పండగ కోలాహలం చూసేందుకు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు కూడా మన రాష్ట్రపండుగగా బోనాలను నిర్వహించుకుంటుంది. మన ఆచార, సాంప్రదాయలకు అద్దంపట్టేలా బోనాలను నిర్వహిస్తున్నారు.



ఫలాహారం బండ్లు..


బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి పూత ఫలహారం బండ్లను సిద్దం చేస్తారు. ఈ బండీని అందంగా పూలతో అలంకరిస్తారు. అంతేకాకుండా.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఉంచుతారు. దాని ముందు.. అనేకరకాల పండ్లు, అమ్మవారికి ఇష్టమైన వాటిని నైవేద్యంగా పెడుతుంటారు. ఈ వాహానాలను ప్రత్యేకంగా పొట్టేళ్లతో లాగేలా ఏర్పాట్లు చేస్తారు. బండ్లపై ఇంట్లో వండిన అనేక రకాల పదార్థాలను పెడుతారు. అమ్మవారి ఆలయం ఉన్న వీధుల్లో దీన్ని తిప్పుతుంటారు. చాలా మంది ఈ బండ్ల మీద అమ్మవారికి తమ ఇంటి నుంచి నైవేద్యం సమర్పిస్తారు.


ఈ బండ్ల ముందు పోతరాజు, శివసత్తులు ఉంటారు. వీరు కొరడా పట్టుకుని భయంకరంగా ఉంటారు. వీరు దుష్టశక్తుల్ని పారద్రోలుతారంటారు. పోతరాజులు ఇంట్లోకి వస్తే మంచిదని కూడా చాలా మందివిశ్వసిస్తారు. పోతరాజు చేతిలో కొరడాతో దెబ్బలు తింటే, నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుందని కూడా భక్తులు నమ్ముతుంటారు. ఫలాహరంబండ్ల మీద ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..



శివసత్తులు అంటే ఎవరు? 



బోనాల జాతరలో శివసత్తులు కూడా కన్పిస్తుంటారు. వీరు పెళ్లి చేసుకొకుండా తమ జీవితాన్ని శివుడికి అంకితం ఇచ్చేసుకుంటారు. వీరి శివుడిని తమ భర్తగా భావిస్తారు. ఎల్లప్పుడు కూడా శివుడు, అమ్మవారి సేవలోనే ఉంటారు. ముఖ్యంగా బోనాలు, ఇతర ఆలయాల ఉత్సవాల సమయంలో శివసత్తులు పూనకం వచ్చి ఊగిపొతు ఉంటారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా వీరు ముందుకు వెళ్తుంటారు. ఈ సమయంలో వారికి సిగం వస్తుంది. సిగం అంటే అమ్మవారు పూనడం. దీనినే పూనకం అని కూడా అంటారు. పోతరాజులు, శివసత్తులు దుష్ట శక్తుల్ని దూరంగా పారద్రోలుతారని చెబుతుంటారు. పోతరాజు అమ్మవారికి సోదరుడని, శివసత్తులు అమ్మవారికి సేవలు చేస్తారని చెబుతుంటారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి