Odisha Puri jagannath Temple ratna bhandar reopen on july after 46 years: మన దేశంలో అనేక వందల, వేల ఏళ్లనాటి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు స్థలపురాణం, మహిమలు ఉన్నాయి. అదే విధంగా ప్రాచీన కాలంనాటి ఆలయాలకు రాజులు అప్పట్లో బంగారంను, వజ్రాలను కైంకర్యం చేసేవారు. ఇప్పటికే అనంత పద్మానాభ స్వామి దేవాలయంను ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా చెప్తుంటారు. అక్కడ ఆలయంలో.. పద్మానాభుడికి రాజులు సమర్పించిన వజ్రాలు, రత్నాలు, రాసులు అనేక గదుల్లో ఉన్నాయని చెప్తుంటారు. కానీ పద్మనాభ స్వామికి చెందిన ఆరో నెలమాళిగ గది మాత్రం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఆగది తలుపు పైన నాగబంధనం ఉంది.
దీనికి శక్తివంతమైన నాగబంధనముందని, ఎవరైన తీయాలని ప్రయత్నిస్తే, పాముల కాటుకు బలౌతారని ప్రచారంలో ఉంది. అందుకే ఇప్పటికి కూడా అనంత పద్మానాభ స్వామి వారి ఆరవగదిని తెరవడానికి ఎవరు కూడా సాహాసం చేయడంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోని కింద రహస్య భాండాగారం గది ఉంది. దీనిలో కూడా జగన్నాథుడికి చెందిన అనేక కొన్ని చెక్కెపెట్టేల నిండా వజ్రాలు,వైఢ్యూర్యాలు ఉన్నాయని చెప్తుంటారు. గతంలో రాజులు, జగన్నాథుడికి అనేక బంగారం, వజ్రాలు, వెండిని సమర్పించారని అవన్ని కూడా ఆ రహస్య గదిలో ఉన్నాయని చెప్తుంటారు. అయితే.. పూరీ రహస్య గదికి ముందు మూడు ఛాంబర్ లు ఉంటాయి.
మొదటి ఛాంబర్ లో జగన్నాథుడికి ప్రతిరోజు ధరించే బంగారం, ఇతర ఆభరణాలు ఉంటాయి. రెండో ఛాంబర్ లో వేడుకలు, ఉత్సవాల సమయంలో వేసే అత్యంత విలువైన ఆభరణాలు ఉంటాయంట. ఇక మూడోది అత్యంత రహస్యమైన భండాగారంగది ఛాంబర్ ఉంటుంది. దీన్ని చివరి సారిగా.. 1978 లో ఓపెన్ చేశారు. అప్పట్లో ఆభరణాలు లెక్కింపుకు 70 రోజులు పట్టిందంట. ఆ లెక్కింపులో.. 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి ఉన్నాయంట. ఆభరణాల లెక్కింపు కోసం 70 రోజులు పట్టిందంటే.. ఏమాత్రం నిధులు ఉన్నాయో అర్థం చేసుకొవచ్చు. మరోమారు 1985 లోను ఆ రహస్య గదిని తెరిచారంట. కానీ ఎందుకొ అప్పట్లో లెక్కింపు సరిగ్గా చేయలేదంట. అప్పటి నుంచి మరల ఇప్పటి వరకు కూడా ఆ గదిని తెరవలేదు.
ఆ గదిలో 1500 ఏళ్ల కిందనాటి బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఉంటాయని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ రహస్య గదిని తెరవాలని, ఒడిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీన్ని సుప్రీంకోర్టు సైతం సపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో..రఘువీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ రహస్య గదిని తెరిచేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గదికి మూడు తాళం చెవులు ఉంటాయి. ఒకటి ఆలయం ప్రదానపూజారీ వద్ద, రెండోది ఆలయం పురాతన ధర్మకర్తలు, మూడోది పూరీ కలెక్టర్ దగ్గర ఉంటాయి.
నవీన్ పట్నాయక్.. తొలుత.. కలెక్టర్ వద్ద ఉన్న తాళం చెవీ మిస్ అయ్యిందని కూడా చెప్పింది. దీంతో ఆ రహస్య గదిని తెరవడం మాత్రం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రజలు మాత్రం జగన్నాథుడిని ఎంతో భక్తితో కొలుస్తుంటారు. నవీన్ పట్నాయక్ సర్కారు కావాలనే ఇలా చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా.. బీజేపీ సర్కారు గెలిస్తే.. జగన్నాథుడి రహస్య గదిని తెరిపిస్తామంటూ కూడా ప్రచారం చేశారు. ప్రజలు కూడా దీనికి మద్దతుగా నిలిచారు. బీజేపీ చెప్పిన ప్రకారం.. బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో 15 మంది సభ్యులు ఉన్నారు.
జులై 14 తెరుచుకొనున్న రహస్య గది..
పూరీ రహస్య గదిని జులై 14 ఆదివారం తెరవనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ గదిమీద కూడా సర్పబంధనం ఉందని ప్రచారం జరుగుతుంది. రహస్య భాండాగారం గదిలో.. భారీ విషసర్పాలు, కింగ్ కోబ్రాలు ఉంటాయని అవిదాడిచేసే ప్రమాదం ఉందని కూడా ప్రచారం తెలుస్తోంది. దీంతో అధికారులు పాములను పట్టేవారిని, పాములు కాటేస్తే.. వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేవారిని కూడా రెడీగా పెట్టుకున్నారంట. అదే విధంగా నాగబంధనం దోషాల నుంచి ఇబ్బందికల్గకుండా.. కొందరు మాంత్రికులను కూడా అధికారులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పూరీలో ఇటీవల అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు రహస్య గది తెరుస్తుండటంతో ఎలాంటి విపత్తు వస్తుందో అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు సైతం కాస్తంత భయం, భయంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రహస్య భాండాగారం తెరుచుకోవడం పట్ల ఒకవైపు ఆసక్తిగానే ఉన్నమరోవైపు మాత్రం అందరిలోను టెన్షన్ సైతం పుట్టిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి