Breaking news 12 omicron positive cases found in telangana in a single day state’s tally rises to 20 : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు హడలెత్తిస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తెలంగాణ రాష్ట్రంపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య (omicron positive cases) మొత్తం 20కి చేరింది. కొత్త‌గా 12 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ ఒక ప్రకటన చేసింది. విదేశాల నుంచి తెలంగాణకు (telangana ) వ‌చ్చిన పది మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Also Read : Karnataka omicron: కర్ణాటకలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు


తెలంగాణలో శనివారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గత 24 గంటల్లో 41,484 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,430కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు చనిపోయారు. 


Also Read : Andhra Pradesh: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం పన్ను రేట్లలో మార్పులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook