Telangana Talli: తెలంగాణ తల్లి కాదు.. చేతి గుర్తు ప్రచారకర్త..!.. కొత్త రూపంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్..
Telangana talli new statue: తెలంగాణ తల్లి కొత్త విగ్రహంను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబరు 9 సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపైన ప్రస్తుతం వివాదం రాజుకుందని తెలుస్తొంది.
Telanganatalli new statue controversy: తెలంగాణ తల్లి కొత్త విగ్రహా రూపంను రేవంత్ సర్కారు విడుదల చేసినట్లు తెలుస్తొంది. ఈ విగ్రహం..తెలంగాణ సామాన్య మహిళ రూపంలో ఉంది. ఆకుపచ్చనీ చీరలు విగ్రహం కన్పిస్తుంది. చేతికి మట్టిగాజులతో ఒకవైపు మన చరిత్రతో పాటు, సంప్రదాయం నిండుదనం ఉట్టిపడుతుందని తెలుస్తొంది. అయితే.. కొత్త విగ్రహం బంగారం రంగులో అంచుతో ఆకుపచ్చని చీర, ఎడమ చేతిలో మొక్కజొన్న కంకి, సజ్జకంకి, చేతికి ఆకుపచ్చని గాజులు, పిడికిళ్లతో, నుదుటిన ఎర్రటిబొట్టు, చెవికి కమ్మలతో తెలంగాణ తల్లి విగ్రహంను రూపిందించినట్లు తెలుస్తొంది.
అయితే.. ప్రస్తుతం తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై మరోసారి వివాదం రాజుకుందని తెలుస్తొంది. ఈ విగ్రహం నమూనపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సైతం... కొత్త నమూనాపై మండిపడినట్లు తెలుస్తొంది.
తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ సర్కారు మరోదాడి చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు.. కొత్త విగ్రహాం.. చేతిగుర్తు తల్లిగా విగ్రహ తయారీ జరిగిందని ఎద్దేవా చేశారు. పార్టీ రంగులు అలంకరణలు, చేతిగుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్ లున్నాయన్నారు. దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి .. చేయిగుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా?.. అంటూకేటీఆర్ ఏకీపారేశారు.
బతుకమ్మ లేకుండా విగ్రహం తయారీ ఉద్దేశ్యమేంటని.. తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలను ఏకం చేసిన బతుకమ్మను లేకుండా ఎలా విగ్రహం తయారు చేస్తారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతులెత్తి మొక్కేలా ఉండాలా?.. లేక ఓ సాధారణ ప్రతిమలా ఉండాలా?.. అని అన్నారు. పదేపదే తెలంగాణ సంస్కృతిక చిహ్నాలపై రేవంత్ దాడి.. లేనీ పోనీ గొడవలు జరిగేలా చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను తొలగించేందుకు కుట్ర చేశారన్నారు. జనం నుంచి తిరుగుబాటు రావడంతో వెనక్కుతగ్గారన్నారు.
ఉద్యమంలో ఏనాడు లేని రేవంత్… తెలంగాణ చరిత్రనుంచి ఉద్యమచిహ్నాలను మాయం చేసేందుకు కుతంత్రం పన్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థాపం రంగుమార్చేందుకు యత్నించి భంగపడిన రేవంత్, తెలంగాణ గీతంగా ప్రజలు గుండెకద్దుకున్న జయజయహే గీతాన్ని మార్చారన్నారు. ఇప్పుడా గీతాన్ని తలుచుకున్న వారే లేకుండా పోయారన్నారు.
Read more: Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..
తెలంగాణ గీతంను సినిమా పాటగా మార్చడంతో ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లి అస్తిత్వంపై రేవంత్ రెడ్డి దాడి చేశాడని ఫైర్ అయ్యారు.రేవంత్ గద్దెనెక్కాక అవసరం లేని పేరు మార్పులు తప్ప.. సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ కుట్రలకు, చేస్తున్న పనులకు ప్రజలు సరైన విధంగా బుద్ది చెప్తారని కూడా కేటీఆర్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook