BRS POLITICS: అలంపూర్ ఎమ్మెల్యే యూటర్న్!
Vijayudu: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి..! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే మళ్లీ యూటర్న్ తీసుకున్నారా..! ఆయన అధికార పార్టీలో చేరడం లేనట్టేనా..! ఇదే విషయాన్ని పార్టీ నేతలకే చెప్పేందుకు పార్టీ అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతారా..! గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవుతారా..!
Challa Venkatrami Reddy: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరితే.. ఓ రెండు నియోజకవర్గాల్లో మాత్రం గులాబీ జెండా ఎగిరింది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో కారు పార్టీ అభ్యర్ధులు తమ సత్తా చూపించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. మరో ఎమ్మెల్యే విజయుడు, ఆయన కూడా అధికార పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ విజయుడు మాత్రం అటు అధికార పార్టీలోకి వెళ్లలేక.. గులాబీ పార్టీలో కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక అలంపూర్ నియోజకవర్గంలో తొలిసారి విజయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న విజయుడు.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సంపత్ కుమార్‌పై విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో విజయుడు నారాజ్ అయ్యారట. అంతలోపే అధికార పార్టీలో చేరుదామని ఫిక్స్ అయినా.. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందట. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విజయుడి చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. విజయుడు కాంగ్రెస్‌లో చేరితే తనకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం తెరమీదకు రావడంతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నితానై వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే విజయుడు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే తన ఉనికికే ప్రమాదమని గుర్తించారట. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరగడంతో గులాబీ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ప్రొగ్రామ్స్‌లోనూ తాను ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ లోనే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ఇన్నాళ్లు అధికార పార్టీలో ఎప్పుడెప్పుడు చేరుదామా అని తెగ ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే విజయుడు ఇప్పుడు సొంత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో క్యాడర్ సైతం తెగ పరేషాన్‌అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి మాత్రం సైలెంట్ మోడ్‌లో ఉన్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ పార్టీలో కంటిన్యూ అవ్వాలా.. లేక అధికార పార్టీలో చేరాలా అని తేల్చుకోలేకపోతున్నారట. ప్రస్తుతం చల్లా వెంకట్రామిరెడ్డి కర్నూలుకే పరిమితం అయినట్టు తెలుస్తోంది. దాంతో పార్టీ శ్రేణులు కూడా ఎటువైపు వెళ్లాలో తెలియక ఆయోమయంలో పడినట్టు చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు తీసుకునే నిర్ణయాల పైనే పరిస్థితులు ఆధారపడి ఉంటాయని క్యాడర్ మదనపడిపోతుందట.. మొత్తంగా గాఢ్ ఫాదర్ చల్లా వెంకట్రామిరెడ్డి సైలెంట్ మోడ్.. ఎమ్మెల్యే యాక్టివ్ మోడ్‌లో ఉండటంతో... అలంపూర్ పాలిటిక్స్ మాత్రం హాట్‌హాట్‌గా సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది..
Also Read: Nagababu: మెగా బ్రదర్ బంపరాఫర్.. కేబినెట్‌లో నాగబాబు శాఖ ఇదే!
Also Read: Chittur Politics: పాలిటిక్స్‌కు ప్యాకప్.. ఓన్లీ మేకప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.