BRS MLC Kalvakuntla Kavitha Delhi Press Meet: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీజేపీని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుందని ఆగ్రహం వ్యక్గం చేశారు. నేడు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపిందని.. కానీ 11వ తేదీన హాజరవుతానని చెప్పినట్లు వెల్లడించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న తరుణంలో ఒక రోజు ముందు నోటీసులు పంపించారని అన్నారు. తాను ధర్నా తర్వాతే విచారణకు వెళతానని స్పష్టంచేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత 27 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళా బిల్లుకు ఆమోదం లభించలేదన్నారు. ఈ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ కూడా హామీ ఇచ్చిందని.. 300పైగా ఎంపీ స్థానాలను ఇచ్చినా బిల్లుపై నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ అంశంపై నోరు విప్పకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టారని విమర్శించారు. 


మార్చి 10 దీక్ష చేపడతామని మార్చి 2నే ప్రకటించామని.. అయితే దీక్ష గురించి ప్రకటించగానే మార్చి 9నే విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపించిందని కవిత అన్నారు. ధర్నాకు సంబంధించిన కార్యక్రమాలు ఉండడంతో 11వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పానని.. ఈడీ మాత్రం 9నే రావాలని నోటీసులు ఇచ్చిందన్నారు. మహిళలను ఇంటికి వచ్చి విచారించాలని చట్టం చెబుతున్నా.. నేరుగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు పంపించిందని అన్నారు. 


తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీజేపీ సర్కారు లక్ష్యంగా చేసుకుందని ఆమె ఫైర్ అయ్యారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని అన్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందన్నారు.  


అయితే కవిత ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగానే ఢిల్లీ పోలీసులు అక్కడికి వచ్చారు. జంతర్‌ మంతర్ వద్ద ఆమె చేపట్టిన ధర్నాపై ఆంక్షలు విధించారు. ఆ ప్లేస్‌లో వేరేవాళ్లు కూడా అనుమతి కోరారని.. అందుకే సగం స్థలం మాత్రమే దీక్ష కోసం వినియోగించుకోవాలని కవితను కోరారు. ధర్నా కోసం ఎప్పుడో అనుమతి తీసుకున్నామని.. ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అంటూ ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Also Read: Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు


 Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook