Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు

Naveen Murder Case Latest Updates: నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితుడు హరిహరకృష్ణతోపాటు నిహారిక, హాసన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదేవిధంగా హరిహరకృష్ణ అక్కాబావల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2023, 02:18 PM IST
Naveen Murder Case: నవీన్ హత్య కేసులో వారిద్దరు ఎక్కడ..? పోలీసులు ముమ్మరంగా గాలింపు

Naveen Murder Case Latest Updates: తెలంగాణలో సంచలనం రేకిత్తించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో సరికొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ అక్కాబావలను కూడా పోలీసులు విచారించేందుకు రెడీ అయ్యారు. అయితే వాళ్లు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. నవీన్‌ను హత్యకు ముందు మూసారాంబాగ్‌లోని ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న  తన అక్క, బావలను హరిహరకృష్ణ కలిసినట్లు తెలుస్తోంది. అక్కాబావ ఇద్దరు శారీరక దివ్యాంగులు కాగా.. నవీన్ హత్యకు సంబంధించిన ఉద్దేశాన్ని వాళ్లకు ఐదు వారాల క్రితమే చెప్పినట్లు సమాచారం. 

నవీన్ హత్య అనంతరం వారిద్దరు ఇంటికి తాళం వేసి ఏటో వెళ్లిపోయారు. హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజే.. వాళ్లు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు పోలీసులు వెళ్లి చెక్ చేశారు. గత రెండు రోజులుగా వారికి ఇంటికి రావడం లేదని.. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతోపాటు.. మొబైల్ జీపీఎస్ ట్రాక్ చేస్తున్నారు. హరిహరకృష్ణ అక్కాబావలను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.  

క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని తలపించే ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది. నవీన్‌ రెడ్డి, హరిహరకృష్ణ ఇంటర్ నుంచే స్నేహితులు. ఇద్దరు నిహారిక అనే అమ్మాయిని ప్రేమించారు. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో అమ్మాయి ఎవరిని ప్రేమించో తెలియదు కానీ.. నవీన్‌ను హరిహరకృష్ణ గత 17న అతిదారుణంగా హత్య చేశాడు. హత్య తరువాత శరీరంలోని ప్రతి భాగాన్ని కట్ చేసి ఆ నిహారికకు వాట్సాప్‌ ఫొటోలను పంపించాడు. నువ్వు ముద్దు పెట్టిన పెదాలు ఇవే కదా.. నీ గుండె ఇదేనా.. నీకు కావాల్సిన మెయిన్ భాగం ఇదేనా .. అంటూ శరీరంలోని అన్ని భాగాలు కట్ చేసి ఆమెకు పంపించాడు.

ఆమె హత్య జరిగిన ప్రదేశం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్‌కు తీసుకువెళ్లి చూపించాడు. ఘటన తరువాత అందరూ సైలెంట్ అయిపోగా.. చివరకు హరిహరకృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణ అనంతరం పోలీసులు నిహారికతోపాటు, హసన్‌ను కూడా అరెస్ట్ చేశారు. తన ప్రేమకు నవీన్ అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో హరిహరకృష్ణ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టి.. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. 

Also Read: Umesh Yadav: ఉమేష్‌ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్   

Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook 

Trending News