TSRTC : త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, పెరిగే ఛార్జీలు ఎంతంటే..
TSRTC bus fare hike : ఆర్టీసీ ఛార్జీల పెంపును ఆమోదించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఛార్జీల పెంపుపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. ఇక ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
Bus fare hike to pull TSRTC out of its debts says Telangana Transport minister Puvvada Ajay Kumar: కోవిడ్ వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, అలాగే పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ (RTC) ఛార్జీలు పెంచాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) డిసైడ్ అయ్యింది. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఒక ఫైల్ సీఎం కేసీఆర్ చేరింది. ఛార్జీల పెంపును ఆమోదించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (vc sajjanar) ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఛార్జీల పెంపుపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది.
ఇక ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు. అయితే పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసల చొప్పున చార్జీలు పెంచాలని.. ఇక అన్నీ ఇతర బస్సుల్లో 30 పైసల ప్రకారం ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి చెప్పారు.
బస్సు ఛార్జీలు పెరిగితే ఆర్టీసీకి ఇప్పుడున్న నష్టాల్లో కొంత మేరకు తగ్గే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ మూడేళ్లల్లో ఆర్టీసి 4,260 కోట్ల రూపాయల మేర నష్టాలు వచ్చాయన్నారు. ఛార్జీలు పెంచితే తెలంగాణ ఆర్టీసీకి (RTC) ఏడాదికి రూ.850 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని మంత్రి వివరించారు.
Also Read : Movie Ticket Price: మూవీ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు హైకోర్టు అనుమతి
ఇక ఛార్జీల పెంపుపై గత నెలలోనే ప్రతిపాదనలు పంపించామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా గవర్నమెంటుకు ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆర్టీసీపై (RTC) డీజిల్ ధరల పెంపుతో పెనుభారం పడిందని సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 9750 ఆర్టీసీ బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ. 1440 కోట్ల నష్టం వచ్చిందని.. అందుకే ఛార్జీలు పెంచాలని గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేశామంటూ సజ్జనార్ పేర్కొన్నారు.
Also Read : National Pollution Control Day 2021: జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం లక్ష్యం తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook