ఎలగెలగా.. మూడు రూపాయలకు టీ కూడా రావడం లేదు.... ఏకంగా చీర ఎలా వస్తదనుకుంటున్నారా.. ఇది అక్షరాల సత్యం.. ఓ షాపింగ్ మాల్ తమ సేల్స్ పెంచుకునేందుకు సరికొత్త ప్రచారానికి తెరలేపింది. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లిండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరంగల్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రండ‌మ్మ‌..రండి. ఆలోచిస్తే ఆశాభంగం...ఇలాంటి మంచి అవకాశం మళ్లీ రాదు !  కేవ‌లం రూ.3 రూపాయ‌ల చీర‌ల్ని ద‌క్కించుకోండి అంటూ ప్రకటన ఇచ్చింది.  ఈ ఆఫర్ గురించి విని ఎవరైనా ఊరుకుంటారా..  ఫిదా అయిన జనాలు షాపింగ్ మాల్ కు భారీ సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు.   షాపింగ్ మాల్ ముందు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. వెనకబడితే చీర అందుతుందో.. లేదో అన్న ఆత్రుతలో కొందరు షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది..


సమాచారం అందుకున్న పోలీసులు..ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాల్‌ను ఒక రోజు పాటు మూసివేసి, ఆ ఆఫర్‌ను ఎత్తేయాలని యాజమాన్యానికి  ఆదేశించారు. దీంతో షాపింగ్‌మాల్ నిన్న ఒక్కరోజు మూతపడింది. ఆ ఆఫర్ కూడా రద్దయింది.


దీంతో చీరలు తీసుకున్న వారు సంబరపడుతూ ఇళ్లకు వెళ్లిపోగా.. చీరల కోసం గంటలుగంటలు క్యూ లైన్లలో నిల్చున్న మహిళలు మాత్రం నిరాశతో వెనుదిరిగారు. జనాలను ఆకర్షించేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని షాపింగ్ మాల్ యాజమాన్యంపై ప‌లువురు మండిప‌డ్డారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.