Chalo Nalgonda Accident: నల్లగొండ వేదికగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 'ఛలో నల్లగొండ' బహిరంగ సభ ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఓ కారు పల్టీ కొట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా.. ఒక హోంగార్డ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ప్రమాదం బారిన పడ్డారు. ఆమె కారును ఆటో ఢీకొట్టడంతో నందిత గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డట్లు నందిత సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chalo Nalgonda: నల్లగొండ సభలో గర్జించిన కేసీఆర్‌.. తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతానని వ్యాఖ్యలు


విషాదం
బహిరంగ సభ భద్రతా ఏర్పాట్లకు వచ్చిన కానిస్టేబుల్‌ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ సభకు వెళ్లే రోడ్లపై పోలీస్‌ సిబ్బంది ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు. వాహనాలు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుసుకుంటున్న సమయంలో చర్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి పోలీసులను ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. ప్రమాదంలో నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు చెందిన హోంగార్డు కిశోర్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో హోంగార్డుకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, పోలీస్‌ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన హోంగార్డును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి


ఎమ్మెల్యేకు గాయాలు
హైదరాబాద్‌ నుంచి నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో లాస్య నందిత పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది. కారు టైరు బయటకు వచ్చింది. ప్రమాదం సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. 'తిరుగు ప్రయాణంలో నల్లగొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేను సురక్షితంగా ఉన్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అందరి సహకారంతో ప్రమాదం నుంచి బయటపడ్డా' అని ట్విటర్‌లో ఎమ్మెల్యే లాస్య నందిత పంచుకున్నారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook