ఖమ్మం బహింగ సభ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడూ  కేసీఆర్ అనవసరంగా తనను తిడుతున్నారని..ఆయన ఆరోపణలు అర్థరహితమన్నారు.. తాను ఇక్కడికి పెత్తనం కోసం వస్తున్నానని కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని రోపిస్తున్నారు..వాస్తవంగా చెప్పాలంటే తాను ఇక్కడి వచ్చింది పెత్తనం కోసం కాదు.. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడేందుకు వచ్చానని చంద్రబాబు వివరణ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సర్కార్ కు చంద్రబాబు సలహా


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో వనరుల కొరత లేదని.. వనరులను సరైన రీతిలో ఉపయోగించుకుంటే దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో వనరులను వినియోంచడంతో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ చేసింది ఏమైన ఉంటే మిగులు బడ్జెట్ ను కాస్త.. తెలంగాణను అప్పుల పాలు చేశారని చంద్రబాబు ఎద్దేవ చేశారు


ఒకే వేదికపై రాహుల్ గాంధీ, చంద్రబాబు


ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు చంద్రబాబు ఓకే వేదికపై రావాడం గమానార్హం. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కారద్యర్శి సురవరం సుధాకర్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మార్పీఎఫ్ అధ్యక్షుడు, మల్లు భట్టివిక్రమార్క, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.