టి.టీడీపీ వ్యూహాత్మక అడుగులు; చంద్రబాబు చొరవతో దారికొచ్చిన రెబల్స్
టికెట్ ఆశించి భంగపడ్డ టి.టీడీపీ అభ్యర్ధులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరిని బుజ్జగిస్తూ రెబల్స్ బెడద లేకుండా పార్టీ వ్యహాత్మంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రెబల్స్ ను చంద్రబాబు అమరావతిలోని తన కార్యాలయానికి పిలిపించుకొని బుజ్జగించినట్లు తెలిసింది. చంద్రబాబును కలిసిన వారిలో కొత్తగూడెం టికెట్ ఆశించిన టీటీడీ రెబల్ అభ్యర్ధి కోనేరు చిన్నితో పాటు ఖైరతాబాద్ నుంచి నామినేషన్ వేసిన బీఎన్ రెడ్డి ఉన్నారు. కాగా చంద్రబాబు హామీతో ఇరువురు నేతలు చల్లబడినట్లు తెలిసింది.
ఇరువురికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని సర్దిచెప్పడంతో ఈ నేతలు దారికొచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారికి కీలక పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ భేటీ అనంతరం కోనేరు చిన్ని మాట్లాడతూ విభేదాలు మరిచి తాము మహాకూటమి గెలుపుకు కృషి చేస్తామని ప్రటించారు.
అలాగే కూకట్ పల్లి టికెట్ ఆశించి భంగపడ్డ పెద్దిరెడ్డితో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి.. తాను పార్టీకి విధేయుడిగా ఉంటాని..మహాకూటమి గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని చంద్రబాబుకు చెప్పినట్లు టాక్. హరికృష్ణ కూతురు సుహాసిని రంగంలోకి దిగడంతో పెద్దిరెడ్డి ఆ సీటును వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం ఆయన కూడా మెత్తబడ్డారు.