కరోనావైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతుండటంతో  కరోనావైరస్ వ్యాప్తి అనంతరం ప్రజల ఆహార పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఏదో ఓ ఆహారం తీసుకున్న వాళ్లలో కూడా ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య రీత్యా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ( Immunity boosting foods ) తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో మార్కెట్‌లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార ఉత్పత్తులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అందులో ముందు వరుసలో ఉండేది విటమిన్-సి ఫుడ్స్ ( Vitamin C Foods ) కాగా ఆ తర్వాత మాంసానికే భారీ డిమాండ్ ఏర్పడింది. Also read: COVID-19: ఆ పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుండటంతో పాటు కరోనా లాంటి రోగాలకు చెక్ పెట్టొచ్చనే సూచనలకు భారీ ప్రచారం లభించడంతో ఇటీవల కాలంలో చికెన్, మటన్, కోడి గుడ్లు ( Chicken, Mutton, Eggs ), విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దాంతోపాటే వాటి ధరలకూ రెక్కలొచ్చాయి.  కరోనావైరస్ వ్యాపించడం మొదలైన తొలి రోజుల్లో చికెన్‌తో కరోనా వ్యాపిస్తుందట అనే పుకార్లు షికార్లు చేశాయి. దీంతో అప్పట్లో చికెన్ ధరలు ( Chicken rates ) బాగా పడిపోయాయి. ఐతే చికెన్‌తో కరోనా రాదు అని ప్రభుత్వాలు, పౌల్ట్రీ పరిశ్రమ పెద్దలు స్పష్టంచేసిన అనంతరం మళ్లీ చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ అప్పటికే చికెన్‌పై నెగటివ్ టాక్ ప్రభావం చూపించడంతో పౌల్ట్రీఫామ్స్ నుంచి చికెన్ సరఫరా సైతం తగ్గిపోయింది. దీనికి తోడు డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం


చికెన్‌లోనూ బ్రాయిలర్ కోడి కంటే నాటు కోడి ( Deshi murgi ) తింటే ఆరోగ్యానికి మరింత మంచిది అనే విశ్వాసం బలపడింది. దీంతో ముందు నుంచే అధిక ధర పలుకుతున్న నాటు కోడికి ఇప్పుడు మరింత డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా కిలో స్కిన్‌లెస్ బ్రాయిలర్ కోడికి సుమారు 250 పలుకుతోంటే..  కిలో నాటు కోడి మాత్రం రూ. 450 నుంచి రూ 500 వరకు పలుకుతోంది. ఇది హైదరాబాద్ లాంటి ఏ ఒక్క నగరానికే పరిమితం అని కాకుండా అన్ని పెద్ద పెద్ద నగరాల్లోనూ ఇంచుమించు ఇటువంటి ట్రెండే కనబడుతున్నట్టు తెలుస్తోంది.  Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు