హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరొనవ్యాప్తి భయంకరంగా విస్తరిస్తోంది. అయితే చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే అవాస్తవాల ప్రచారంతో ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిస్థాయిలో కుదేలవ్వడంతో గత వారం కిలో చికెన్‌కు రూ.40 నుంచి రూ.60 వరకు ధర ఉండగా ఇప్పుడు ఒక్కసారిగా రూ.170కి చేరింది. చికెన్, గుడ్లు తినడం వలన కరోనా వంటి వైరస్ సోకదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సీఎం కేసీఆర్  మీడియా సమావేశంలో ప్రకటించడంతో చికెన్ ప్రియులు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని రాష్ట్ర పౌల్ట్రీ ప్రతినిధులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: వలస కార్మికుల విచిత్ర గోస..


 మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే అత్యవసర సేవల్లో భాగంగా చికెన్ సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఇంద్ర ప్రభుత్వం పకడ్బందీ దిగ్భంధంతో కొనసాగిస్తున్న సమయంలో అన్ని చోట్ల షాప్‌లు తెరుచుకోకపోవడంతో మాంస ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. 


Read Also: Also Read: ప్రధాని సహాయనిధికి 20 కోట్లు విరాళం..!!


కాగా, కరోనా మహమ్మారిని జయించేందుకు భారత్‌లో 21 రోజులపాటు విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే గతంలో బయట తిరిగిన వ్యక్తులకు పాజిటీవ్‌గా తేలుతోంది. వీటి నేపథ్యంలోనే సామాజిక దూరం పాటించాలని, అనవసరంగా బయట తిరగవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసుశాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు. గత రెండు రోజుల్లోనే భారత్‌లో 15 మరణాలు సంభవించడం కలవరపెడుతోంది.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..