Chinna Jeeyar: సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చినజీయర్ వివరణ...
Chinna Jeeyar Press Meet: వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు.
Chinna Jeeyar Press Meet: వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. రెండు మూడు రోజులుగా వివాదాలు తలెత్తాయని... అది సబబా కాదా అన్నది విన్నవాళ్లకే వదిలేస్తున్నానని అన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వివాదం చేస్తున్నారని... కొంతమంది పనిగట్టుకుని రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. మహిళలను కించపరిచే పద్దతి తమది కాదని... మహిళలను చిన్నచూపు చూసే పద్దతిని తాము ప్రోత్సహించమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా చినజీయర్ స్వామి విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
గ్రామ దేవతలు మనుషుల్లో నుంచే వచ్చారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. గ్రామ దేవతలను తూలాడినట్లు ఆరోపణలు వస్తున్నాయని.. దురుద్దేశపూర్వకంగా తామెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన కామెంట్లపై మాట్లాడేవారు పూర్వపరాలు చూడాలన్నారు. అందరినీ గౌరవించాలనేదే తమ విధానమని అన్నారు. తన వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం హాస్యాస్పదమని అన్నారు. సామాజిక హితం మీద నిజమైన కాంక్ష ఉన్నవారైతే తనతో వచ్చి మాట్లాడాల్సింది అన్నారు. అంతే తప్ప, ఆయా వేదికలపై గొంతు చించుకోవడం పబ్లిసిటీ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకెప్పుడూ కులం, మతం అనే పట్టింపు లేదని చినజీయర్ పేర్కొన్నారు. ఎవరి పద్దతిలో వారు ఉండాలని.. మన పద్దతిని మనం ఆరాధించుకోవాలని అన్నారు. హరిజనులైనా, గిరిజనులైనా జ్ఞానంలో ఉత్తములైతే వారికి ఆరాధ్యనీయ స్థానం ఇవ్వాలని రామానుజచార్యులు వారు చెప్పారన్నారు. సమతామూర్తి సందర్శన కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనడాన్ని తప్పు పట్టారు. అది దర్శనం కోసం పెట్టిన టికెట్ కాదని, ఆ ప్రాంగణ నిర్వహణ కోసమే రూ.150 టికెట్ పెట్టామని అన్నారు. సమాజ హితం కోసం అందరం కలిసి పనిచేద్దామని... అందరినీ గౌరవిద్దామని పిలుపునిచ్చారు.
Also Read: Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook