Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

Harbhajan Singh to Rajya Sabha from Punjab. టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ త్వరలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి  రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 04:02 PM IST
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం
  • హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్
  • ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు హర్భజన్
Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

AAP to send Former India cricketer Harbhajan Singh to Rajya Sabha from Punjab: టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) హర్భజన్‌ను పంజాబ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్ స్వయంగా భజ్జీతో చర్చలు జరిపి రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేసారట. అయితే హర్భజన్ ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. గతేడాది హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 

ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆప్ తరుఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భగవంత్ చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా భజ్జీకే అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఐదు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒక స్థానానికి భజ్జీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తొలుత ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. ఆ వార్తలను భజ్జీ స్వయంగా కొట్టిపారేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో కలిసి భజ్జీ ఫొటో దిగారు. దీంతో హర్భజన్‌ కాంగ్రెస్ పార్టీలో చేరి.. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా జరగలేదు. ఇక ఇటీవల పంజాబ్‌లో ఆప్‌ గెలిచిన తర్వాత భగవంత్‌మాన్‌ తన తల్లిని హత్తుకున్న ఫొటోను హర్భజన్‌ షేర్‌ చేస్తూ.. అభినందనలు చెప్పారు. దీంతో భారత మాజీ క్రికెటర్ ఆప్‌లో చేరడం ఖాయమే అని మీడియాలో కథనాలు వచ్చాయి. చివకు అదే నిజం అయ్యేలా ఉంది. 

హర్భజన్‌ సింగ్ తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి 2021 డిసెంబర్ మాసంలో వీడ్కోలు పలికారు. 1998లో భారత్ జట్టులోకి వచ్చిన హర్భజన్.. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 417 టెస్టు వికెట్లు పడగొట్టిన భజ్జీ.. వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు తీశారు. చివరిగా భారత్ తరఫున 2016 మార్చి 3న యూఏఈతో టీ20 మ్యాచ్‌లో ఆడారు. 2016 నుంచి వీడ్కోలు మ్యాచ్‌ కోసం భజ్జీ ఎదురుచూసినా.. భారత సెలెక్టర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

Also Read: RRR AP Tickets: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!!

Also Read: Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News