గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య  సయోధ్య పూర్తిగా చెడిందా.. మజ్లిస్ ఎమ్మెల్యే అంతటి తీవ్ర వ్యాఖ్యలకు కారణమేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC Elections ) ఎన్నికల్లో సమీకరణాలు మారబోతున్నాయి. టీఆర్ఎస్-మజ్లిస్ ( TRS and MIM partis ) పార్టీల మధ్య అందరూ ఊహించిన పొత్తు లేదని తేలిపోయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin owaisi ) నేరుగా ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా..కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ( TRS ) తమ పోటీ అని కూడా స్పష్టం చేశారు. మజ్లిస్ అధినేత ఈ వ్యాఖ్యలు చేసిన కాస్సేపటికే..అదే పార్టీకు చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ( Charminar mla ) ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తాము తల్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని( TRS Government ) రెండు నెలల్లో కూల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీ చాలామందిని చూసిందని..తమ పార్టీ అధినేత చెప్పినట్టుగా రాజకీయం తకు ఇంటి గుమస్తాతో సమానమని చెప్పారు. కేసీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఒకరిని కూర్చోబెట్టడం, దించడం రెండూ తమకు తెలుసని అన్నారు. 


మజ్లిస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మిత్రపక్షాలుగా భావించిన రెండు పార్టీలు ఇలా విమర్శలు చేసుకోవడం దేనికి సంకేతమో తెలియక కార్యకర్తల్లో సందిగ్దత నెలకొంది. అయితే ఇదంతా ఓట్ల కోసం రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. Also read: GHMC Elections 2020: గ్రేటర్ పోరులో..టీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఒవైసీ