Telangana Districts wise Govt Job vacancies list: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. 80,039 పోస్టుల భర్తీకి ఈరోజు నుంచే నియామక ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఇక మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని, అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లపాటు పెంచినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఇక దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు పేర్కొన్నారు. సీఎం ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీ వివరాలను పరిశీలిస్తే హోంశాఖలో 18,344 పోస్టులు.. పాఠశాల విద్యాశాఖలో 13,086.. వైద్యఆరోగ్యశాఖలో 12,755.. ఉన్నత విద్యాశాఖలో 7,878.. బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు.


80,039 పోస్టులలో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 5,268 ఖాళీలు ఉండగా.. 1,976 పోస్టులతో నిజామాబాద్‌ తర్వాతి స్థానంలో ఉంది. ఇక అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 556 పోస్టులు ఉండగా.. రాజన్న సిరిసిల్లాలో 601 ఖాళీలు ఉన్నాయి.


జిల్లాల వారీగా ఖాళీలు: 
హైదరాబాద్ - 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి - 1,769
రంగారెడ్డి - 1,561
కరీంనగర్ - 1,465
నల్లగొండ - 1,398
కామారెడ్డి - 1,340
ఖమ్మం - 1,340
భద్రాద్రి కొత్తగూడెం - 1,316
నాగర్‌కర్నూల్ - 1,257
సంగారెడ్డి - 1,243
మహబూబ్‌నగర్ - 1,213
ఆదిలాబాద్ - 1,193
సిద్దిపేట - 1,178
మహబూబాబాద్ - 1,172
హనుమకొండ- 1,157
మెదక్ - 1,149
జగిత్యాల - 1,063
మంచిర్యాల - 1,025
యాదాద్రి భువనగిరి - 1,010
జయశంకర్ భూపాలపల్లి - 918
నిర్మల్ - 876
వరంగల్ - 842
కుమ్రం భీం ఆసీఫాబాద్ - 825
పెద్దపల్లి - 800
జనగాం - 760
నారాయణపేట్ - 741
వికారాబాద్ - 738
సూర్యాపేట - 719
ములుగు - 696
జోగులాంబ గద్వాల - 662
రాజన్న సిరిసిల్లా - 601
వనపర్తి - 556

 


Also Read: Mamata New Front: దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలు, మమతా బెనర్డీ కొత్త ఫ్రంట్


Also Read: Telangana Jobs Notifications: తెలంగాణ నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ భారీ బొనాంజ.. 91 వేల పోస్టులకు నోటిఫికేషన్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook