Telangana Jobs Notifications: తెలంగాణ నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ భారీ బొనాంజ.. 91 వేల పోస్టులకు నోటిఫికేషన్!!

Telangana CM KCR announces 91,142 Job Notifications. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీపి క‌బురు అందించారు. 91 వేల 142 పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 12:02 PM IST
  • నిరుద్యోగుల‌కు భారీ బొనాంజ
  • 91 వేల పోస్టులకు నోటిఫికేషన్
  • కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న నిరుద్యోగులు
Telangana Jobs Notifications: తెలంగాణ నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ భారీ బొనాంజ.. 91 వేల పోస్టులకు నోటిఫికేషన్!!

Telangana CM KCR announces 91,142 Job Notifications In Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తీపి క‌బురు అందించారు. రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. 80,039 ఉద్యోగాల‌కు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇక 11 వేల కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఎంప్లాయిస్‌ తెలంగాణలో ఉన్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్రంపై పడుతుందని, అయినా కూడా మా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుందన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుందని సీఎం స్పష్టం చేశారు. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేసిందని సీఎం చెప్పుకొచ్చారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. ఎస్‌సీ /ఎస్‌టీ/బీసీ అభ్యర్థులకు 49 ఏళ్లు.. దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దాంతో ప్రతిఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. యువత, నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఇక ఓయూలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి బాణా సంచా కాల్చుతున్నారు. ఓయూ రోడ్లపై పరుగులు తీస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Mamata New Front: దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలు, మమతా బెనర్డీ కొత్త ఫ్రంట్

Also Read: First SHO Woman Officer: సీపీ సర్‌ప్రైజ్.. 174 ఏళ్ల హైదరాబాద్‌ పోలీస్‌ చరిత్రలో తొలిసారిగా మహిళా ఇన్‌స్పెక్టర్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News