TRS ఎమ్మెల్యే మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Condoles Death Of Solipeta Ramalinga Reddy Death) ) తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం (Solipeta Ramalinga Reddy Death) పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, తమ ప్రాంతవాసిగా అనుబంధం ఉన్న వ్యక్తిని కోల్పోయానంటూ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (TRS MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఉద్యమనేత సోలిపేట మరణంపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యే సోలిపేట మరణం ఉమ్మడి మెదక్ జిల్లాకు, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రజల కోసం పరితపించిన నాయకుడని కొనియాడారు. Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి
శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తనను కలచివేసిందన్నారు మంత్రి కేటీఆర్. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. Photos: పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
సాహో డైరెక్టర్ Sujeeth Wedding Photos
నాలుగుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి సొంతం. ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయనకు భార్య, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడి మరణంపై టీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. IPL ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు