Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ (Telangana Corona Positive Cases) పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,092 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Aug 6, 2020, 10:28 AM IST
  • తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పంజా
  • తాజాగా 2,092 కోవిడ్19 పాజిటివ్ కేసులు
  • బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 13 మంది మృతి
  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య, ఆరోగ్యశాఖ
Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ (Telangana Corona Positive Cases) పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,092 కోవిడ్19 (COVID19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Telangana COVID19 Cases) 73,050కి చేరింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 589కి చేరింది. కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి

అదే సమయంలో 1,289 మంది చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్19 బారి నుంచి 52,103 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 20,358 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

తాజా కేసులలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 535 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డిలో 169,  వరంగల్ అర్బన్ 128, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 126, కరీంనగర్‌లో 123, సంగారెడ్డిలో 101, నిజామాబాద్ 91, రాజన్న సిరిసిల్లలో 83, జోగులాంబ గద్వాల 72, ఖమ్మం 64, పెద్దపల్లి 54, మహబూబ్ నగర్ 48 మంది తాజాగా కరోనా బారిన పడ్డారు. సాహో డైరెక్టర్ Sujeeth Wedding Photos 
 
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

Trending News