L Ramana to join TRS soon: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ స్పష్టంచేశారు. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎల్ రమణ (L Ramana meets CM KCR).. అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ.. ''సీఎం కేసీఆర్‌తో జరిగిన చర్చలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయని'' అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను ప్రస్తావించిన కేసీఆర్.. నన్ను తనతో పాటు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. కేసీఆర్ ఆహ్వానం నేపథ్యంలో తన నిర్ణయం కూడా అందుకు సానుకూలంగానే ఉంటుందని చెప్పానని ఎల్ రమణ (L Ramana) స్పష్టంచేశారు.


Also read: Zika Virus cases: కేరళలో జికా వైరస్.. థర్డ్ వేవ్ రాకముందే మరో వైరస్


కేసీఆర్‌కు ఎల్ రమణ అంటే అభిమానం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎల్ రమణను తీసుకుని వెళ్లి సీఎం కేసీఆర్‌ని కలిసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగతి భవన్ బయట ఎల్ రమణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. '' చేనేత కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన రమణ (TTDP chief L Ramana) అంటే సీఎం కేసీఆర్‌కి అభిమానం'' అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి రమణ సేవలు చాలా అవసరం. చేనేత వర్గాలకు చాలా చేశాము. ఇంకా చేయాల్సి ఉంది. అందులో భాగంగానే రమణను టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. తాను, రమణ ఒకరికొకరం శ్రేయోభిలాషులమని చెప్పిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao).. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చోటు లేదని అభిప్రాయపడ్డారు.


Also read : YSR Telangana Party: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, జండా ఆవిష్కరించిన షర్మిల


హుజూరాబాద్ ఉప ఎన్నికకు (Huzurabad bypolls) ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనియాంశమైంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook