L Ramana: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన TTDP చీఫ్ ఎల్ రమణ

TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2021, 12:41 AM IST
L Ramana: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన TTDP చీఫ్ ఎల్ రమణ

TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది. అంతేకాకుండా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలను తమ బాటలోకి తెచ్చుకుని రాష్ట్రంలో ఆ పార్టీని బలహీనపర్చడంలో సక్సెస్ అయిన సీఎం కేసీఆర్ (CM KCR).. రమణను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో టీడీపీని మిగలకుండా చేయాలని భావిస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. మరోవైపు ఆయనకు బీజీపీ నుంచి కూడా ఆహ్వానం అందిందనే ప్రచారం కూడా జరిగింది. ఇదే విషయంపై తాజాగా ఎల్ రమణ స్పందించారు. 

Also read : TS inter second year exams: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై ఉత్తర్వులు, Results పైనే కసరత్తు

తాను పార్టీ మారుతున్నట్టు వస్తోన్న వార్తలపై ఎల్ రమణ స్పందిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీతో పాటు బీజేపీ నేతలు (TRS, BJP) కూడా తనను సంప్రదించిన మాట వాస్తమేనని... అయితే, పార్టీ మార్పు అంశం గురించి మాత్రం తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాల ప్రాతిపదికగానే తన రాజకీయ ప్రయాణం సాగుతుందని రమణ తేల్చిచెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామా రావు టీడీపీని స్థాపించిన సమయంలోనే ఆయన ప్రోత్సాహంలో టీడీపీలో చేరా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పార్టీ బీఫారంపై పదిసార్లు పోటీచేసే అవకాశం లభించింది. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో పార్టీని ముందుండి నడిపించే అవకాశం ఇచ్చారు అని గుర్తుచేసుకున్నారు. 

Also read : Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్

బలహీన వర్గాల నాయకుడిగా టీడీపీ అభివృద్ధికి నా వంతు కృషి చేశా. కానీ ప్రస్తుత పరిస్థితులు ఒకప్పటిలా లేవు. అప్పటితో పోల్చుకుంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పదవుల్లో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నా. అందుకే మా కార్యకర్తలతో, అనుచరులతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించా. అంతేకానీ పార్టీ మారుతానని నేను ఎక్కడా చెప్పలేదు. వార్తల్లో వస్తున్నట్టుగా ప్రతిపాదనలు పెట్టి పదవులు ఆశించలేదు అని రమణ (TTDP chief L Ramana) వివరించారు.

Also read : Rythu Bandhu Scheme: తెలంగాణ రైతులకు శుభవార్త, రేపటి నుంచే అన్నదాతలకు రైతుబంధు సాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News