CM KCR Returned From Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ కేసీఆర్ షెడ్యూల్‌ కన్నా ముందే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు, గాల్వన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. 


అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్‌లతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ నాయకులను కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారని కేసీఆరే స్వయంగా చెప్పడం ఆయన ఢిల్లీ టూర్ వెనక పక్కా పొలిటికల్ ఎజెండా ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కేసీఆర్‌తో రాజకీయ చర్చలపై అటు కేజ్రీవాల్ కానీ ఇటు అఖిలేశ్ కానీ నోరు మెదపలేదు. కేసీఆర్‌తో రాజకీయ చర్చలపై కేజ్రీవాల్‌ను మీడియా ఆరా తీసినప్పటికీ... తమకు రాజకీయాలు చేయడం రాదు.. స్కూళ్లు, ఆసుపత్రులే నిర్మించడమే తెలుసంటూ కామెంట్ చేశారు. దీంతో ఒకరకంగా కేసీఆర్‌ను కేజ్రీవాల్ చులకన చేసినట్లయింది.


గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమికి కేసీఆర్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని, ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఇప్పుడు కేజ్రీవాల్, అఖిలేశ్ ఎలాగైతే కేసీఆర్‌తో చర్చలపై మౌనం పాటించారో... అప్పుడు మమతా, నవీన్ కూడా అలాగే మౌనం పాటించారు. అప్పటి ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగడంతో.. ఆ తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఊసెత్తలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ప్రత్యామ్నాయ కూటమి దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన ఎంతమేర సఫలమవుతారో వేచి చూడాల్సిందే..!
 


Also Read: Bandi Sanjay: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడి నుంచో తెలుసా..?


Also Read: KCR National Tour: కేసీఆర్ జాతీయపర్యటన, రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం పెంచుతోందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.