యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో యాదాద్రిని ( Yadadri ) భారత దేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు అని,  ప్రపంచ వ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు కేసిఆర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!


ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న కరోనావైరస్ ( Coronavirus ) నుంచి రాష్ట్రం కోలుకుంటుంది అని పేర్కొన్నారు కేసిఆర్. నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందచేస్తున్న నేపథ్యంలో పనుల వేగాన్ని పెంచాల్సి తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో యాదాద్రిని ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు కష్టపడాలన్నారు.


యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, బస్టాండ్ తదితర పలు నిర్మాణాల పురోగతి గురించి సీఎం కేసిఆర్ ( KCR ) చర్చించారు. యాదాద్రి చుట్టు పక్కల పరిసర ప్రాంతాల సుందరీకరణ, లాండ్ స్కేపింగ్ అంశాలు ఎలా ఉండాలో ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. గుట్టమీదికి బస్సులు వెళ్ళే మార్గాల నిర్మాణం, విఐపీ కార్ పార్కింగ్ నిర్మాణం, కళ్యాణ కట్ట, పుష్కరిణీ ఘాట్లు  బ్రహ్మోత్సవ, కళ్యాణ మండపాల నిర్మాణాల విషయాలను సీఎం సమీక్షించారు.



Also Read | Photos: నాగార్జున సాగర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు


పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయ తుదిమెరుగులకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగులు దిద్దిన అనుభజ్జులైన శిల్పులతోనే పనులు చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR