Monthly pension scheme for farmers in Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అమ్ములపొదిలో నుంచి మరో అస్త్రాన్ని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. మరో సంక్షేమ పథకంతో తెలంగాణ రైతు లోకానికి మరింత చేరువయ్యే యోచనలో ఉన్నారు. గతంలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంలో.. తమ వద్ద ఇంకా కొన్ని అద్భుతమైన పథకాలు ఉన్నాయని... అవన్నీ బయటకు తీస్తే ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ పథకాలు ఒక్కొక్కటిగా బయటకు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే రైతులకు ఫించన్ ఇచ్చే పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో 47 ఏళ్లు నిండిన రైతులందరికీ ప్రతీ నెలా రూ.2016 ఫించన్ ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కసరత్తులు మొదలుపెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 47 ఏళ్లు, 49 ఏళ్లు పైబడిన రైతులు ఎంతమంది ఉన్నారనే డేటాను సేకరించే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మూడు నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న 47 ఏళ్ల వయసు వారిని ఈ ఫించన్‌కు అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.


తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు, రైతు భీమా పథకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. రైతు బంధు పేరిట ఎకరానికి రూ.5వేలు చొప్పున రెండు పంటలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భీమా పథకం కింద ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5 లక్షలు భీమా అందిస్తోంది. ఇక త్వరలోనే రైతులకు ఫించన్ పథకం (Farmers Pension Scheme) కూడా అమల్లోకి తీసుకొస్తే... వచ్చే ఎన్నికల నాటికి రైతాంగమంతా అధికార టీఆర్ఎస్ వెంటే ఉంటుందని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Also Read: Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook