జూన్ 25 నుంచి ఆరో విడత హరితహారం
తెలంగాణలో ఆరో విడత హరితహారాని(Haritha Haram)కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో విడత హరితహారాన్ని నర్సాపూర్‌లో ప్రారంభించనున్నారు. భారీ మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్: రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హరితహారం (Haritha Haram) పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని (Tree Plantion) ప్రతిఏటా ఉద్యమంలా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 25నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
30కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు సైతం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) నర్సాపూర్ లో మొక్క నాటి ఈ హరితహారాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవి పునరుద్ధరణలో భాగంగా ఆయన మొక్క నాటి ఆరో విడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. కరోనా వచ్చినా పర్లేదు.. మందు దొరికితే చాలు!
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను (Plant Nurserys) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ