KCR visits BRS Office in Delhi: హైదరాబాద్ నుండి నేరుగా ఉత్తర్ ప్రదేశ్ వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయలో ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్​కుమార్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్​ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న జోద్‌పూర్‌ వంశీయుల బంగ్లాను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ కార్యాలయంలో కలియ తిరిగి అక్కడ జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్న కేసీఆర్‌.. కార్యాలయంలో చేయాల్సిన మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. 


బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఢిల్లీలో పలు జాతీయ పార్టీల నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఈ వారం మొత్తం కేసీఆర్‌ ( CM KCR ) ఢిల్లీలోనే ఉంటారని సమాచారం అందుతోంది.


Also Read : Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా


Also Read : Munugodu Bypoll: మునుగోడులో ఏం జరుగుతోంది, కోమటిరెడ్డి ఎటువైపు, విదేశీ పర్యటనలో మర్మమేంటి


Also Read : KTR HOT COMMENTS: బఫూన్ గాళ్లతో వేగలేం.. మునుగోడు బరి నుంచి తప్పుకుంటాం! కేటీఆర్ సంచలన ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి