KTR HOT COMMENTS: మునుగోడు ఉప ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. బీజేపీతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్జిపై విరుచుకుపడ్డారు. ఒక కాంట్రాక్టర్ బలుపు వలనే ఉప ఎన్నిక వచ్చిందన్నారు కేటీఆర్. బీజేపీ ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయ కాంట్రాక్ట్ ఇవ్వడం వలనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని చెప్పారు. కోమటిరెడ్డికి ఇచ్చినట్లు నల్గొండ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు ఇస్తే.. మునుగోడు ఉప ఎన్నిక నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటుందంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుందన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ లోనే ఉంటూ బీజేపీకి పని చేశారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేశారు కేటీఆర్. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు కోవర్టు రెడ్డీలు అంటూ ఫైరయ్యారు. తప్పు చేయని వాళ్లు ఎవరికి భయపడరని అన్నారు కేటీఆర్. మోడీ, ఈడీ తన వెంట్రుక కూడా పీకలేరన్నారు. నిజాయితీగా ఉన్నవాళ్లకు భయమెందుకని చెప్పారు. చావనైనా చస్తాం కాని బీజేపీపై పోరాటంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు గోల్ మాల్ గుజరాత్ మోడల్ తమకు అవసరం లేదన్నారు. విజయవంతమైన తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేస్తామన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇతర ప్రాంతాల్లోనూ గులాహీ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి నీకు చిత్తశుద్ది ఉంటే సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. వైఎస్సార్,. చంద్రబాబే నయం.. ఇప్పుడంతా బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ క్షుద్ర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.
Also Read: బౌలింగ్ ఎంచుకున్న భారత్.. రాహుల్, త్రిపాఠికి నిరాశే! కెప్టెన్ మళ్లీ మారాడు
Also Read: HBD Amitabh Bachchan : అమితాబ్‌పై చిరు, రజినీ ట్వీట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook