CM KCR Yadadri Tour: ఇవాళ సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం సతీసమేతంగా పూజలు చేయనున్నారు. అంతేకాకుండా ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. సీఎం (CM KCR) పర్యటన నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వామివారికి కిలో 16 తులాల పసిడి ఇవ్వాలని కేసీఆర్ గతంలో నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ బంగారాన్ని స్వామివారికి సమర్పించనున్నారు. నేటి ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు సీఎం. ఈ సందర్భంగా ఆలయంలోని వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 


రేపు హనుమకొండకు సీఎం
అక్టోబరు 1న హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. ములుగు రోడ్డులోని ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను సీఎం ప్రారంభించనున్నారు. 


Also read: Vijay Darda Meets CM KCR: తెలంగాణ సీఎంఓలో పొరపాటు.. నాలుక కర్చుకున్న అధికారులు.. అప్పటికే పబ్లిక్‌లోకి న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook