Rythu Runa Mafi Rules in Telangana: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై  కేబినెట్‌లో చర్చించామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం అని.. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం అని.. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంత్రివర్గ సమావేశ అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28 వేల కోట్లు అని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: పవన్ పేషీలో పవర్ ఫుల్ ఐఏఎస్.. కేంద్రానికి స్పెషల్ గా లేఖ.. ఎందుకో తెలుసా.? 


"గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది. మా ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం పదేళ్లలో  రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాం.


ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం.. జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత  శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం. రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు..? రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు. నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో  అన్ని పొందుపరుస్తాం.. ఏకాధాటిన  రుణ మాఫీ చేయాలని నిర్ణయం. మొదటి 100 రోజుల పరిపాలన చేశాం.." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter