RTC Bus Accident: బొగ్గు లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. కొత్తగూడెంలో విషాదం
ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 43 మంది ప్రయాణికులు ఉన్న బస్సు బొగ్గులారీని డీ కొట్టడంతో బస్సు పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఆ వివరాలు
RTC Bus Accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రతి రోజు కామన్ అన్నట్లుగా పరిస్థితి మారింది. రెగ్యులర్ గా ఏదో ఒక చోట యాక్సిడెంట్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. యాక్సిడెంట్స్ వల్ల ఎంతో మంది మృతి చెందినట్లుగా వార్తలు చూస్తూనే ఉన్నా ఇంకా కూడా కొందరు మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు.
గమ్యస్థానం తొందరగా వెళ్లాలనే ఆరాటం కారణంగా యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నేడు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
ప్రమాదం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం డిపో నుండి 47 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ బయల్దేరింది. తమతమ గమ్య స్థానాల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. చుంచుపల్లి మండలం ఆనందగని అడ్డరోడ్డు నుండి బొగ్గు లారీ స్పీడ్ గా వచ్చింది.
ఆ వేగంతో బస్సును ఢీ కొట్టడంతో బస్సు పల్టీలు కొట్టుకుంటూ పక్కన పడిందట. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని లేదు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీసులు మరియు రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!
యాక్సిడెంట్ కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు బొగ్గు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేయడంతో పాటు లారీని సీజన్ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందని.. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పడ్డట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు.
ఒకరు ఇద్దరి పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కొత్తగూడెం ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద క్షతగాత్రులు మరియు వారి బంధువులతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook