TS Eamcet Hall Tickets: ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!

TS Eamcet 2023 Hall Ticket Download: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. eamcet.tsche.ac.in లింక్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కింది స్టెప్స్ ఫాల్ అయి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2023, 01:44 PM IST
TS Eamcet Hall Tickets: ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!

TS Eamcet 2023 Hall Ticket Download: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు ఆదివారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. మే 10వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి.. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. తెలంగాణ ఎంసెట్ పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించనుంది. 

హాల్‌ టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

==> ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
==> హోమ్ పేజీలో TS EAMCET హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌ను ఓపెన్ చేయండి.
==> అడిగిన ఆధారాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
==> మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. 

==> దానిని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రంగా దాచుకోండి.

షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎంసెట్ పరీక్షలు మే 10, 11, 12, 13, 14 తేదీలలో రెండు షిఫ్ట్‌లలో జరగనున్నాయి. మే 10, 11వ తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్‌, మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు.. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 

ఎసెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌కు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్‌ 10వ తేదీనే గడువు ముగిసింది. అయితే మే 2వ తేదీ వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ప్రతి 100 మందిలో ముగ్గురు లేట్‌ ఫైన్‌తోనే దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.250 నుంచి  5 వేల  రూపాయల వరకు అదనంగా ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటుండటం విశేషం. శుక్రవారం వరకు మొత్తం 3,19,947 మంది ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. 

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  

Also Read: Punjab Gas Leak: ఘోర విషాదం.. పంజాబ్‌లో గ్యాస్‌ లీక్‌.. 9 మంది మృతి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News