BJP Telangana: టీ బీజేపీలో కోల్డ్‌వార్.. కొత్త ప్రెసిడెంట్ రావాల్సిందేనా!
Kishan Reddy: తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త చీఫ్ రాబోతున్నారు..! రాష్ట్ర చీఫ్‌గా ఎవరిని నియమించాలని పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చీఫ్‌ను పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారా..! కొత్త అధ్యక్షుడి డైరెక్షన్లోనే పనిచేద్దామని నేతలంతా డిసైడ్ అయ్యారా..! ఆ విషయంలో పార్టీ చీఫ్ కీలక నేతలు, క్యాడర్‌ను ఎందుకు కట్టడి చేస్తున్నారు..!
Kishan Reddy: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నేతలంతా సీనియర్స్-జూనియర్స్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చీఫ్ కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బిజీబిజీ కావడంతో ఢిల్లీకే పరిమితం అయ్యారు. అప్పడప్పుడు రాష్ట్రానికి వస్తున్నా.. పూర్తిస్థాయిలో నేతలకు సమయం కేటాయించలేకపోతున్నారు. మరోవైపు పార్టీ పెద్దల ఆదేశాలను సొంత పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర చీఫ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకేమీ పట్టన్నట్టు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ విజయోత్సవాలు జరుపుకుంటోంది. అయితే కాంగ్రెస్ విజయోత్సవాలకు నిరసనగా బీజేపీ చార్జ్‌షీట్ రిలీజ్ చేసి ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ నేతల పిలుపును పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారట. మరోవైపు హైడ్రా, మూసీ ప్రక్షాళన విషయంలోనూ నేతలు.. ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు రాష్ట్రంలో కమలం పార్టీకి మంచి ఊపున్న పార్టీ చీఫ్ వ్యవహార తీరుతోనే నేతలు వెనుకడుగు వేస్తున్నట్టు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న నేతలను కిషన్ రెడ్డే ఎదగనీయడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషన్ రెడ్డి పార్టీలో నేతలను, క్యాడర్‌ను పనిచేయించుకుని వదిలేస్తారని టాక్ ఉంది. అందుకే యువమోర్చా, మహిళా మోర్చాను కూడా తన అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు పార్టీ చీఫ్ తీరుపై సొంత పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం చేయాల్సిన సమయంలో వద్దని వారించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇలా చేస్తే రానున్న రోజుల్లో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ పెద్దలు ఆదేశాలు ఇస్తున్న సమయంలో.. ప్రభుత్వంపై పోరాటం చేయకుండా నిలువరించడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం కాస్తా పార్టీ హైకమాండ్‌కు తెలియడంతో.. ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రధాని మోడీ ఢిల్లీకి పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఇక మోడీతో సమావేశంలోనూ నేతలంతా పార్టీ చీఫ్ సరైనా గైడెన్స్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
మొత్తంగా లోకల్ బాడీ ఎన్నికల్లోపు పార్టీకి కొత్త చీఫ్‌ను నియమిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ షురువైంది. కొత్త ఏడాది తొలివారంలోనే పార్టీకి కొత్త చీఫ్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ రానుందని చెబుతున్నారు. ఇక రాష్ట్ర చీఫ్ రేసులో పలువురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు రేసులో ఉన్నారని చెబుతున్నారు. వీరిలో బీసీ నేతకు రాష్ట్ర చీఫ్ పదవి దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరిలో ధర్మపురి అరవింద్- ఈటెల రాజేందర్ మధ్య రసవత్తర పోరు నడుస్తోందట.. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా తనకు మరో చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. గతంలో తాను చీఫ్‌గా ఉన్న సమయంలో పార్టీకి మంచి జోష్ వచ్చిందని గుర్తు చేస్తున్నారట.. పార్టీ హైకమాండ్ మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అందరి పేర్లను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తోందట. మొత్తంగా పార్టీకి కొత్త వస్తేగానీ తెలంగాణలో కమలం పార్టీ బాగుపడే పరిస్ధితులు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read: BRS Politics: గులాబీ పార్టీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే!
Also Read: Pushpa2 movie: పుష్పా2 షో సందర్భంగా మరో షాకింగ్ ఘటన.. మూవీ చూస్తు వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.