Ali responded on village secretary notices: కమెడియన్ అలీకి ఇటీవల తెలంగాణ సర్కారు బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని కూడా వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కమెడియన్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడిలో 14 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తొంది.అయితే.. ఆయన వ్యవసాయం కోసం కోనుగోలు చేసి.. దానిలో పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల దానిలో ఒక ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టినట్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. గతంలో కూడా అలీకి ఈ ఫామ్ హౌస్ నిర్మాణపై నోటీసులు ఇచ్చారంట. కానీ అప్పట్లో ఆయన ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. తాజాగా, గ్రామపంచాయతీ కార్యదర్శి మరల నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. దీనిపై అలీ కావాలని ప్రభుత్వ నోటీసులు పట్టించుకోలేదని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జారీ చేసిన నోటీసులపై కమెడియన్ అలీ స్పందించినట్లు తెలుస్తొంది.


తాను.. ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం భూమిని లీజుకు ఇచ్చానని పేర్కొన్నారు. ఫార్మ్‌ ల్యాండ్‌లో కట్టడాలపై లీజుకు తీసుకున్న వాళ్లే సమాధానం చెప్తారని అన్నారంట. మరోవైపు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో.. అలీ తీరుపై మాత్రం..ఎక్మామిడి గ్రామ సర్పంచ్.. అధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరంట.


Read more: Ram gopal Varma: ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్.. రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు..


ఒక మంచి హోదాలో ఉండి.. నలుగురికి మంచి చెప్పాల్సిన వారు ఇలాగ ప్రయత్నాలు చేయడంఏంటని కూడా ఏకీ పారేస్తున్నారంట.  ప్రస్తుతం అలీ తీరును కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారంట. మొదటి సారి నోటీసులు వచ్చినప్పుడు స్పందిస్తే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా.. చాలా మంది అలీ తీరు కరెక్ట్ కాదంటున్నారు. మొత్తానికి ఈ ఘటన ఎటువైపు వెళ్తుందో అంటూ వార్తలు వస్తున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.