komati reddy rajgopal reddy angry on lady officer: తెలంగాణ లో ఇటీవల కొందరు మంత్రులు వివాదస్పదంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో.. విలేకరుల మీద  బల్ల గుద్ది మరీ.. రుస రుస లాడారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమకు అధికారం వచ్చిందని.. ప్రజలు, అధికారుల పట్ల ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఏకీపారేస్తుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా కోమటిరెడ్డి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై నెటజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక  ఎమ్మెల్యే పదవీలో ఉండి.. మహిళ అధికారిపై ఇలాగేనా ప్రవర్తించేదంటూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




పూర్తి వివరాలు..


కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి..  ఇటీవల చౌటుప్పల్ నియోజక వర్గంలో జరుగుతున్న డెవలప్ మెంట్ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో  వివిధ శాఖల అధికారులతో  పనులపై ఆరా తీశారు. డ్రైనేజీ పనులు, సీసీ రోడ్డులు, బిల్లుల రికార్డులను తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు కూడా రూ. 12 కోట్ల అగ్రిమెంట్ లో వేల్యూలో ఎంత గ్రాస్ అయ్యిందని అక్కడి అధికారులను ఎమ్మెల్యే అడిగారు. దీనికి అధికారులు సరైన విధంగా రెస్పాన్స్ కాలేదు. ఒక మహిళ అధికారిణి దీనిపై క్లారిటీ ఇవ్వబోగా.. ఆయన తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. 


అధికారులు ఇచ్చిన సరైన సమాచారం లేదని ఆవేశంలో ఊగిపోయారు. తన చేతిలోని పేపర్లను విసిరికోట్టి, ఐదు నిముషాల్లో తనకు వివరాలు చెప్పాలని ఆవేశంతో ఊగిపోయారు. మీకు సబ్జెక్ట్ విషయంలో నాలెడ్జ్ ఉందా.. అంటూ ప్రశ్నించారు. అవగాహన లేకుంటే లీవ్ లో వెళ్లిపోండని అధికారులకు, ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. మీరు చెప్పింది వినడానికి ఇక్కడకు రాలేనని.. నేను ఏ విషయాల మీద అడుతున్నానో.. దానిపై సరైన విధంగా క్లారిటీ ఇవ్వండని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు.  ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా కష్టాలు వచ్చిపడుతున్నాయి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో తీహర్ జైలులో ఉన్నారు. మరోవైపు గొర్రెల స్కామ్, ఫోన్ టాపింగ్ వ్యవహరాలు క్రమంగా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి. ఇక కేటీఆర్ కు కూడా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా పరాభవం పాలైంది. కనీసం ఒక్కస్థానంలో కూడా గెలువలేకపోయింది. 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి