CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావోస్తోంది. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్‌ విజయోత్సవ సభలను నిర్వహించాలని తీర్మానించింది. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షతన గాంధీభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే అధికార పార్టీ నేతలు టీపీసీసీ సమావేశానికి ఎందుకు లైట్‌ తీసుకున్నారనే చర్చ గాంధీభవన్‌లో జోరుగా జరుగుతోందట. గాంధీభవన్‌కు రావడం ఇష్టంలేక సమావేశానికి గైర్హాజరు అయ్యారా.. ఇంకా ఏమైనా కారణముందా అనే టాక్‌ వినిపిస్తోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా గాంధీ భవన్ లో టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , కొందరు నేతలు మాత్రమే హాజరయ్యారు. ఈ భేటీకి పార్టీ మారిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చారు. కానీ చాలామంది అధికార పార్టీ నేతలు డుమ్మా కొట్టారు. అయితే ఈ సమావేశానికి నేతలు ఎందుకు రాలేదని టీపీసీసీ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఏడాది పాలనపై విజయోత్సవ సభలను నేతలు ఎందుకు లైట్‌ తీసుకున్నారని ఆరా తీస్తున్నారట. గాంధీభవన్‌లో ఆరు నెలలకో, ఏడాదిలో ఒకసారి సమావేశం జరుగుతుంది. అలాంటి సమావేశానికి కూడా నేతలు ఎందుకు రాలేదని చర్చ జరుగుతోందట. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమావేశంలోనే నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది. అయితే ఇంతా కీలకమైన మీటింగ్‌కు రానీ నేతలపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ సైతం పెరిగిపోతోందట.


వాస్తవానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. వారంలో రెండురోజులు గాంధీభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. పార్టీకి- ప్రభుత్వానికి మధ్య వారధిగా మంత్రులు నిలుస్తున్నారు. కానీ కొందరు నేతలు మాత్రం పార్టీని- ప్రభుత్వాన్ని కలుపుకుపోవడంలో వెనకపడ్డారనే చర్చ జరుగుతోందట.. లోకల్‌ బాడీ ఎన్నికలకు ముందు నేతలు ఇలా కీలక సమావేశాలకు డుమ్మా కొట్టడాన్ని మాత్రం పెద్దలు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే కానీ మిగతా నేతలు దారికి రారనే చర్చ సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది.


మొత్తంగా అధికారం లోకి రావడంలో పార్టీ కీలకంగా వ్యవహరించిన పార్టీని నేతలు ఎందుకు లైట్ తీసుకుంటున్నారనే చర్చ సైతం లేకపోలేదు. ఇకమీదట అయినా పార్టీ నిర్వహించే సమావేశాలకు నేతలు తప్పకుండా వచ్చేలా చూడాలని మరికొందరు నేతలు చెబుతున్నారట. చూడాలి మరి టీపీసీసీ ఎంత మంది నేతలపై చర్యలు తీసుకుంటుందో అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే..!
Also read: KTR on Wankidi: పిల్లలు చనిపోతే ఢిల్లీకి పోతావా ?


Also Read: Manthani Hostel: హస్టల్‌లో షాకింగ్ ఘటన.. కనక వర్షం కురుస్తుందని బాలికతో నగ్న పూజలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.