Telangana Incharge Deepa Das Munshi Meets Hyderabad Mayor Gadwal Vijayalakshmi: హాట్ సమ్మర్ లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మరికొందరు పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి నేతలను జాయిన్ చేసుకొవడంతో బిజీగా ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలను తమపార్టీలో జాయిన్ చేసుకోవడానికి పావులుకదుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఇంటికి వెళ్లారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో మంతనాలు జరిపి, తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇక.. ఎంపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించడమే టార్గెట్ గా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.


ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మల్కాజ్ గిరి, సికింద్రాబాద్,చెవెళ్ల పార్లమెంట్ స్థానాలలో గెలుపు టార్గెట్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక .. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రానందున.. ఈసారి ఎంపీ ఎన్నికలలో భారీ ఎత్తున చేరికలతో ఆయా స్థానాలను స్వీప్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Read More: Viral News: ఇదెక్కడి కరువురా నాయన.. సోదరుడిని పెళ్లాడిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..?


మేయర్ గద్వాల విజయలక్ష్మి.. ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డిని కలవడం కూడా మరో చర్చకు దారితీసింది. దీపాదాస్ మున్షీ, కేకేశవరావుకు మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతోనే తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరికకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అనేక మంది కార్పోరేటర్లు, ఇప్పటికే కాంగ్రెస్ కండువ కప్పుకున్న నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరిక అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter