Congress MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్‌కు హ్యాండ్‌ ఇచ్చి ఆయన స్థానంలో మహేష్ కుమార్‌ గౌడ్‌ను ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కోటాలో రెండు సీట్లకు ఎన్నిక జరగనుంది. ఈ రెండు సీట్ల కోసం కాంగ్రెస్‌లో డజన్ మందికి పైగా పోటీ పడినా.. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. ఫోన్‌ చేసి నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలని పార్టీ పెద్దలు చెప్పారట. దీంతో నామినేషన్‌కు అద్దంకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నామినేషన్‌ పత్రాలపై జగ్గారెడ్డి సైన్‌ చేశారని, పార్టీ బీఫాం తీసుకుని నామినేషన్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో ఇక తాను ఎమ్మెల్సీ అయిపోయానని అనుకున్నారు అద్దంకి. కానీ లాస్ట్‌ మినిట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు హ్యాండ్‌ ఇచ్చింది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అద్దంకి దయాకర్‌కు అన్యాయం జరిగింది. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ను అద్దంకి దయాకర్‌ ఆశించారు. కానీ పార్టీ మాత్రం ఆయన మొండిచేయి చూపింది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దయాకర్‌ మాత్రం పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. టికెట్‌ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేశారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అద్దంకి దయాకర్‌కు న్యాయం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి భావించారు. ప్రస్తుతం ఆయన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండగానే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది. దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి అందినట్లే అంది దూరమైంది. అయితే ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందా..? లేదా తెలియకుండా జరిగిందా అనే చర్చ మొదలైంది.  


అద్దంకి దయాకర్‌ను పక్కన పెట్టడానికి కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇద్దరు జూనియర్లకు ఇవ్వడం సరికాదని సీనియర్లు హైమాండ్‌పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. సీనియర్ల ఒత్తిడితో అద్దంకి దయాకర్ స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను ఖరారు చేశారని గాంధీభవన్‌లో చర్చ సాగుతోంది. మరోవైపు తనకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంతో అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ హై కమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పార్టీలో తనకు మంచి పొజిషన్ రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అద్దంకి దయాకర్‌ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  


Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 


Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter