CoronaVirus In Telangana | కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతోన్న జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ర్యాపిడ్ యాంటిజెన్ కోవిడ్ 19 పరీక్షల (Corona Rapid Tests)ను బుధవారం ప్రారంభించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి, కరోనా సోకిన బాధితులతో సన్నిహితంగా ఉన్నవారి (ప్రైమరీ కాంటాక్ట్స్) నుంచి ముక్కు, గొంతు స్రావాలు శాంపిల్ సేకరిస్తారు. ప్రత్యేక కిట్ సాయంతో చేసే ఈ కోవిడ్19 పరీక్షలో కేవలం 30 నిమిషాల్లో ఫలితం వస్తుంది. Telangana: 30వేలకు చేరువలో కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో 25 మంది వరకు టెస్టులు నిర్వహించనున్నారు. ర్యాపిడ్ టెస్టులు  మొదలుపెట్టిన తొలి రోజు కేసులు అధికంగా ఉన్న ఈ మూడు జిల్లాల్లో దాదాపు 600కు పైగా కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం. అయితే ర్యాపిడ్ కిట్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందంటే (COVID19 Rapid Tests) కరోనా బాధితుడిగా గుర్తిస్తారు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


రెండోసారి మరో నిర్దారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెగటివ్ వచ్చిందంటే మాత్రం ఇప్పటివరకు చేస్తున్న రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్ష చేసి నిర్ధారించుకుంటారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos